ఇక అమెరికా నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌.. | India signs first long term LPG import deal with US | Sakshi
Sakshi News home page

ఇక అమెరికా నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌..

Nov 17 2025 11:33 AM | Updated on Nov 17 2025 11:55 AM

India signs first long term LPG import deal with US

చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న భారత చమురు కంపెనీలు

వెల్లడించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి

భారత్‌కు ఇక అమెరికా నుంచి ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ) దిగుమతి కానుంది. ఈమేరకు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యూఎస్‌ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

‘ఇది చరిత్రలో తొలిసారి! అతిపెద్ద, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్‌పీజీ మార్కెట్లలో ఒకటైన భారత్‌ యునైటెడ్ స్టేట్స్‌కు తెరుచుకుంటోంది. భారత దేశ ప్రజలకు తక్కువ ఖర్చులో సురక్షితమైన ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఎల​్‌పీజీ సోర్సింగ్ ను వైవిధ్యభరితం చేస్తున్నాం. భారతీయ పీఎస్‌యూ చమురు కంపెనీలు ఒక సంవత్సరానికి దాదాపు 2.2 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకున్నాయి.’ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఒప్పందం ప్రకారం.. 2026 సంవత్సరానికి గానూ 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అమెరికా ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకోనున్నాయి. యూఎస్‌ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ దిగుమతుల పరిమాణం భారతదేశ మొత్తం వార్షిక ఎల్‌పీజీ దిగుమతులలో 10 శాతం మేర ఉండనుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బృందాలు ప్రధాన అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరపడానికి ఇటీవలి నెలల్లో అమెరికాను సందర్శించాయని, అవి ఇప్పుడు విజయవంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement