నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్‌తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు.


