
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్‌తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..
తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్‌షాక్‌కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్‌లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.

భర్త మృతిపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ సుస్మిత కంటతడి
తన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్‌ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.
పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.
జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్‌కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం..
సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్‌లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.
రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టు
సుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?
రాహుల్: టేప్‌తో కట్టేయ్
సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.
రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్
సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోంది

మృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)
ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
#WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ
— ABP News (@ABPNews) July 19, 2025