breaking news
Uttam Nagar
-
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్‌తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్‌షాక్‌కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్‌లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్‌ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్‌కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్‌తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్‌తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్‌పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్‌నగర్‌లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్‌నగర్‌లో నివసిస్తున్న విజయ్‌పాల్, సంతోష్ భార్యభర్తలు. విజయ్‌పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్‌పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్‌తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్‌తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్‌పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు. కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.