
సాక్షి, బంజారాహిల్స్: రాంగ్‌రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ జర్నలిస్ట్‌కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్‌రూట్‌లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు.
(చదవండి: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో)
దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.