
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha Letter) రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ను కార్నర్ చేసి.. బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కవిత లేఖ ‘కాంగ్రెస్ వదిలిన బాణం‘ అనే OTT ఫ్యామిలీ డ్రామా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం. కుటుంబ పార్టీ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కుటుంబ పార్టీ వాటి సొంత సంక్షోభాన్ని ప్రజల ఎమోషన్లుగా మార్చాలని చూస్తోంది. కానీ, తెలంగాణ ప్రజలు ఈ లేఖ డ్రామాని పట్టించుకోవడం లేదు.
బీజేపీ(BJP) ఎవరినీ జైలుకు పంపదు. చట్టం ఆ పని చేస్తుంది. తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. తెలంగాణలో ప్రతీ సర్వే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని చెబుతోంది. అధికారం.. ఆర్భాటాలు లేకున్నా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారు. వాళ్లు కోరుకునేది అభివృద్ధి.. నిజమైన మార్పు. అంతేగానీ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాలు కాదు. నిజమైన మార్పు బీజేపీ తోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారాయన.
ఇదీ చదవండి: కవిత లేఖపై తర్వాత స్పందిస్తాం- హరీష్ రావు