తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా | Cannes Aishwarya Dons Heirloom Jewels At Regal Necklace With 500 Carat Mozambique Rubies | Sakshi
Sakshi News home page

తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్‌ లుక్‌కి ఫిదా

May 22 2025 11:18 AM | Updated on May 22 2025 12:37 PM

 Cannes Aishwarya Dons Heirloom Jewels At Regal Necklace With 500 Carat Mozambique Rubies

కాన్స్‌ ఫిలిం ఫెస్టివ్‌లో అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్  మళ్లీ మెరిసింది.  దశాబ్దానికి పైగా  ప్రతిష్టాత్మక రెడ్‌కార్పెట్‌పై మెరుస్తున్న  ఐశ్వర్య ఈ ఏడాది కూడా  తన అందంతో అందర్నీ ఆశ్చర్యపర్చింది. భారతీయ సంస్కృతిని గౌరవించేలా దుస్తులతో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని విస్మయ పర్చింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సుదీర్ఘ విరామం తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ చీరలో మెరవడం ఒక విశేషమైతే, ముఖ్యంగా ఆమె ధరించిన  కెంపుల హారం, ఇతర ఆభరణాలు  మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 51 ఏళ్ల వయసులో  అందమైన  బెనారసీ  చీర, అందమైన నగలు నుదుట సింధూరంతో ముగ్ధమనోహరంగా మెరిసిన ఐశ్వర్య లుక్‌ పలువురి ప్రశంసలందుకుంది.  

కాన్స్‌లో తొలిసారి చీరలో మెరిసిన ఐశ్వర్య
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కనిపించడానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మనీష్ మల్హోత్రాడిజైన్‌ చేసిన చీర, ఆభరణాలను ఎంచుకుంది.  ఐవరీ, రోజ్ గోల్డ్ కలర్‌ బెనారసీ రియల్‌ సిల్వర్‌ జరీ  ఎంబ్రాయిడరీ చీరలో రాయల్‌లుక్‌తో అదరగొట్టింది. వారణాసి ఫేడింగ్ సాంప్రదాయ కడ్వా టెక్నిక్‌తో  హ్యాండ్‌ లూమ్‌ చీర ఆది తితో నేయబడింది.కడ్వా టెక్నిక్‌లో ప్రతి మోటిఫ్‌ను  చాలా అందంగా తీర్చిద్దారు. అలాగే బంగారం, వెండితో తయారు చేసిన   వైట్‌ టిష్యూ, జర్దోజీ ఎంబ్రాయిడరీతో  చేతితో తయారుచేసిన దుపట్టాను ధరించింది. మొత్తంమీద, ఆమె లుక్ భారతీయ నైపుణ్యం, సంస్కృతి, వారసత్వాన్ని  చాటి చెప్పింది. ఈ లుక్ ఫ్యాషన్ విమర్శకులను, అభిమానులను ఆకట్టుకుంది.

సాధారణంగా  కనిపించే పచ్చలకు బదులుగా  కాన్స్‌ ఈవెంట్‌లో ఐశ్వర్య  కెంపులతో రూపొందించిన లేయర్డ్‌ హారాన్ని , మ్యాచింగ్‌ చౌకర్‌ను ధరించింది.  ఇవి కూడా మనీష్‌ మల్హోత్రా హౌస్‌నుంచి వచ్చినవే.  ఐశ్వర్యతన ఐశ్వర్యాన్ని ప్రతిబింబించేలా 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపుల పొడవైన అద్భుతమైన  హారాన్ని ఎంచుకుంది.

అన్‌కట్‌డైమండ్స్‌,  కెంపులతో 30 క్యారెట్ల 18 క్యారెట్ల నాణ్యతగల బంగారంతో దీన్ని రూపొందించారు.  దీనికి జతగా రూబీస్ స్టేట్‌మెంట్ రింగ్  ఐశ్వర్యకు రాయల్‌ లుక్‌నిచ్చింది. సంక్లిష్టమైన పూల డిజైన్‌లో తయారు చేసిన ఆభరణలు ప్రపంచ వేదికపై సాంప్రదాయ భారతీయ హస్తకళ ల అద్భుతాన్ని ప్రదర్శించారు.

ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్‌ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్‌ సక్సెస్‌ స్టోరీ

ఐశ్వర్య రాయ్‌ లుక్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్ ను గుర్తుకు తెచ్చేలా ఐశ్వర్య రాయ్ సిందూర్ ధరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఐశ్వర్య నిలిచిందంటూ కొనియాడారు.

చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్‌ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement