ముత్యాల నగలు, ఘూంఘట్‌ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌ | Janhvi Kapoor Makes Cannes Debut Sculpted Dress With Ghoonghat | Sakshi
Sakshi News home page

ముత్యాల నగలు, ఘూంఘట్‌ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌

May 21 2025 12:25 PM | Updated on May 21 2025 12:55 PM

Janhvi Kapoor Makes Cannes Debut Sculpted Dress With Ghoonghat

అలనాటి అందాల తార దివంగత  శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (Cannes Film Fesitval 2025) అరంగేట్రం చేసింది. డెబ్యూలోనే తన అందం, ఫ్యాషన్‌ స్టైల్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. డిజైనర్ డ్రెస్, ముత్యాల దండలు, చక్కటి మేలిముసుగుతో తళుక్కున మెరిసింది.  దీంతో 2025 కాన్స్‌లో భారతీయ అందగత్తెలు -ఉత్తమ లుక్‌ టైటిల్ జాన్వీకి  ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్‌.

బాలీవుడ్‌లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరైన జాన్వీ కపూర్, తన అందమైన లుక్స్ ,నటనా నైపుణ్యాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా   బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్లష్ పింక్ త్రీ-పీస్ ఎథ్నిక్ డ్రెస్‌లో తనదైన స్టైల్‌లో అరంగేట్రం చేసింది.జాన్వీ రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా  జాన్వీతోపాటు, నీరజ్ ఘయ్వాన్, ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్ , విశాల్ జెత్వా కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు.

ఘూంఘాట్‌లో జాన్వీ కపూర్  కాన్స్ అరంగేట్రం 
జాన్వీ లుక్‌ను ఆమె కజిన్ , సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేశారు. తరుణ్ తహ్లియాని  ప్రత్యేకంగా రూపొందించినగౌనులో జాన్వీ కపూర్‌ మెరిసింది.  2022లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ధరించిన  ఫ్రాక్‌ అలా అనిపించినా, భిన్నమైన లుక్‌లో ఉంది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, సావ్లీన్ మంచాంద జాన్వి లుక్ కు 90ల నాటి శ్రీ దేవి  గ్లామ్ ను జోడించింది,లేత గులాబీ రంగులో , కార్సెట్ బాడీస్ బాటమ్‌, పొడవాటి ట్రాతో కూడిన స్కర్ట్‌ను ఆమె  ఎంచుకుంది.  దీనికి అందమైన  ఘూంఘాట్ మరో హైలైట్‌గా నిలిచింది.  దాన్ని తలపై కప్పుకుని మహారాణిలా జాన్వీ  అడుగులు వేయడం స్పెషల్‌గా నిలిచింది.

డిజైనర్‌ డ్రెస్‌తో  పాటు ముత్యాల ఆభరణాలు ఆమె లుక్‌కి మరింత హుందాతనాన్నిచ్చాయి. జాన్వీ నెక్లెస్‌ల స్టాక్‌తో సహా ముత్యాల నగలు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహంలేదు. చోపార్డ్  హౌస్‌కు చెందిన డైమండ్ పొదిగిన బ్రూచ్, డైమండ్  డ్రాప్ స్టైల్ పెండెంట్, లారియట్ స్టైల్ నెక్లెస్, ఒక సిగ్నేచర్ మల్టీ లేయర్డ్ నెక్లెస్‌తో షో  స్టార్ గా నిలిచింది.  దీనికి జతగా ప్లవర్‌ డిజైన్‌ డైమండ్‌ చెవిపోగులు,  చక్కటి మేకప్ హెయిర్‌డోతో, ఆమె తన లుక్‌ను  ఎలివేట్‌  చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement