
హీరోయిన్ ఆదితి శంకర్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. కోలీవుడ్ హీరోయిన్ ఆదితి శంకర్ భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందు వస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భైరవం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#AditiShankar Live Dance Performance for #OVennela Song at #Bhairavam Event#BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohith pic.twitter.com/ehgv08ARi5
— The Cult Cinema (@cultcinemafeed) May 18, 2025