సాయం చేయాలంటూ 'మంచు మనోజ్‌' ట్వీట్‌ | Manchu Manoj Asking Help For 2 Days Old Baby In His X Account, Tweet Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సాయం చేయాలంటూ 'మంచు మనోజ్‌' ట్వీట్‌

Jun 9 2025 7:47 AM | Updated on Jun 9 2025 9:45 AM

Manchu Manoj Asking Help For 2 days Baby

భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్‌.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్‌ ఒక పోస్ట్‌ చేశారు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్‌ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

సాయం చేయాలంటూ మంచు మనోజ్‌ ఇలా ట్వీట్‌ చేశారు. ' రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను.  ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.' అంటూ  ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్‌  ఖాతాను షేర్‌ చేశారు. 

అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్‌ వర్క్‌ చేయడం లేదని కొందరు స్క్రీన్‌ షాట్స్‌ పంపడంతో.. మంచు మనోజ్‌ మరోక బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను షేర్‌ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్‌ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్‌ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.

Advertisement
 
Advertisement
Advertisement