
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాశం యాదగిరి గొడవకు దిగారు, ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.
ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు.. ఛాంబర్లో సినారె ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.