
టాలీవుడ్ హీరోహీరోయిన్లలో చాలామంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. అంటే షూటింగ్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిరోజూ జిమ్‌కి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. గతంలో చాలాసార్లు జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌లో పాల్గొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
'టేక్ 20 హెల్త్' పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత.. ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా 'డెడ్ హ్యాంగ్' ఛాలెంజ్ పూర్తి చేసింది. అంటే 90 సెకన్ల పాటు ఓ రాడ్‌కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా దాన్ని పూర్తి చేశారు కూడా.
(ఇదీ చదవండి: 'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!)
'మీరు ఎలా కనిపిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేదే ముఖ్యం' అని సామ్ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత బక్కగా అయిపోయిందేంటి అని మాట్లాడుకుంటున్నారు.
కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయట్లేదు. 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లైన్‌లో ఉంది గానీ ఇది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా నిర్మాతగా చేసిన తొలి మూవీ 'శుభం' రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదలుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. అలానే దర్శకుడు రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందనే పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)