
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. మొన్నీమధ్య భర్త వరుణ్ తేజ్‌తో కలిసి పుట్టబోయే బిడ్డ కోసం దుబాయిలో షాపింగ్ కూడా చేసొచ్చారు. అలానే లావణ్య బేబీ బంప్‌తో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈమె నటించిన లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మరోసారి హంగామా చేసిన నటి కల్పిక)
టీజర్ బట్టి చూస్తుంటే ఇది భార్యభర్తల స్టోరీతో తీసిన ఫన్నీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. భార్యగా లావణ్య, భర్తగా దేవ్ మోహన్ నటించారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనం ఇక కలిసుండలేం అని భర్త అంటే, అతడిని ఇంట్లోనే కట్టిపడేసి ఏం చేసిందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఇందులో లావణ్య, దేవ్ మోహన్‌తో పాటు వీటీవీ గణేశ్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ తదితరులు నటించారు.
తాతినేని సత్య చాలాకాలం తర్వాత తెలుగులో ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. ప్రస్తుతానికైతే టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో? ఇప్పటికైతే లావణ్య త్రిపాఠి చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదొక్కటే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత తెలుగులో మూవీస్ చేస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్)