
ధనుష్ రఘుముద్రి, మనోజ్
‘‘చిక్కక చిక్కిన గుమ్మా... నిను వదలను ఏ జన్మా... అడగక అందిన వరమా... చేజార్చను ఇకపైనా..’’ అంటూ సాగుతుంది ‘థాంక్యూ డియర్’ సినిమాలోని ‘చిక్కక చిక్కిన గుమ్మ...’ పాట. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని తొలి పాట ‘చిక్కక చిక్కిన గుమ్మ...’ను హీరో మంచు మనోజ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఈ పాటకు ఈ చిత్రనిర్మాత బాలాజీ రెడ్డి సాహిత్యం అందించగా, శ్రీచరణ్ పాడారు. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్.