ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ చూశారా? | The Raja Saab makers unveil Sanjay Dutt first look on his birthday | Sakshi
Sakshi News home page

The Raaja Saab: ప్రభాస్ 'ది రాజాసాబ్'.. సంజు బాబా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజ్‌

Jul 29 2025 3:28 PM | Updated on Jul 29 2025 3:37 PM

The Raja Saab makers unveil Sanjay Dutt first look on his birthday

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్కామెడీగా వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు ఆడియన్స్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.

అయితే చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్బర్త్డే కావడంతో స్పెషల్పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా..  దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్లోనూ 'బాఘి 4', 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement