ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్‌ను తేదీని కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే జూన్ 16న ఉదయం 10:52 గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మారుతి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆల్ సెట్ డార్లింగ్స్.. లెట్స్ రాక్ ఫ్రమ్ టుమారో' అంటూ టైమ్ ఫిక్స్ చేశారు.
టీజర్‌పై అధికారిక ప్రకటన రావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
All SET darlings
Hope u all ready 💖
Let's rock from tomorrow 10.52 am#TheRajaSaabTeaser pic.twitter.com/Q2aGbYAcnU— Director Maruthi (@DirectorMaruthi) June 15, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
