ఈ ఏడాదిలో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు భారీగా ఎదురుచూసిన చిత్రం వార్-2.. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీని తెలుగు రైట్స్‌ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను క్లారిటీ ఇచ్చాడు. అసలు వార్-2 ఎంత మొత్తానికి కొన్నాడో చెప్పుకొచ్చాడు.
'వార్-2 సినిమాలో నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్ రూ. 68 కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్ అయ్యేసరికి రూ. 40 కోట్ల వరకు షేర్ వచ్చింది. అయితే, యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. వార్-2 వల్ల నేను నష్టపోలేదు.' అని మొదటిసారి లెక్కలతో సహా వంశీ చెప్పారు. ఈ లెక్కన తను రూ. 10 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.
I Bought Jr Ntr @tarak9999 Garu's & HRX @iHrithik Garu's #War2 Film For 68 Crores + Gst & It Got Theatrical Revenue Nearly For 40 Crores Share & I Met The Team Of @yrf & Spoke With Them & They Returned The Amount Of 18 Cr - @vamsi84 Garu#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/bWL5lkwid1
— 𝐓𝐞𝐚𝐦 𝐅𝐨𝐫 𝐓𝐚𝐫𝐚𝐤 (@TeamForTarak) December 25, 2025


