టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్‌మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్‌మస్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
రాజ్ నిడిమోరుతో ఏడడుగులు..
సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.


