ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌'.. ఏకంగా రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్! | The Raja Saab Movie Team Special Song Plan With Thaman | Sakshi
Sakshi News home page

The Raja Saab: ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్.. రూ.5 కోట్లు సేవ్ చేసిన తమన్!

Jun 18 2025 8:05 PM | Updated on Jun 18 2025 8:54 PM

The Raja Saab Movie Team Special Song Plan With Thaman

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. హారర్‌, కామెడీతో పాటు విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ‍ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ సాంగ్‌ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఓ ఫుల్ మాస్‌ సాంగ్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారు. దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ ‍మ్యూజిక్‌ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్‌ టీమ్‌ను  దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు టాలీవుడ్‌ బీజీఎం కింగ్ ఎస్ఎస్‌ తమన్‌ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్స్ మరో ప్లాన్‌కు రెడీ అయ్యారు. తమన్‌తోనే ఓ ప్రత్యేక సాంగ్‌ను కంపోజ్‌ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్‌ తన రేంజ్‌లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్‌ టీమ్‌కు దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్‌ అయినట్లే. ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం తమన్‌ ఎలాంటి బీట్స్‌ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్‌ చేయడంలో తమన్‌ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా.. ది రాజాసాబ్‌ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement