
ప్రభాస్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ అయినా..ఇప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. సమయం దొరికితే ఫ్రెండ్స్ కలిసి టూర్స్‌ని వెళ్తుంటాడు. బయటకు సైలెంట్గానే కనిపిస్తాడు కానీ ప్రభాస్ చాలా అల్లరోడు అని రాజమౌళితో పాటు చాలా మంది స్నేహితులు చెప్పారు.
సెట్లో సరదాగా ఉంటాడని ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు చెబుతుంటారు. అయితే తెర వెనుక ప్రభాస్ ఎలా ఉంటాడు? ఏ స్థాయిలో అల్లరి చేస్తాడో తాజాగా బహుబలి చిత్రబృందం బయటి ప్రపంచానికి చూపించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రభాస్కి సంబంధించిన స్పెషల్ వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ప్రభాస్ చాలా సరదాగా ఉన్నాడు. బాహుబలి గెటప్ వేసుకొని అనుష్కతో పాటు రానాపై ఫన్నీ పంచులు విసిరాడు. ‘ఎంత పని చేశావ్ దేవసేన’ అంటూ ‘అమ్మా లేడు నాన్న లేడు.. ’ అనే పాటను పాడుతూ రానాతో ముచ్చటించాడు. మధ్యలో అనుష్క వచ్చి ప్రభాస్తో మాట్లాడడంతో అంతా నవ్వారు’. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm
— Baahubali (@BaahubaliMovie) August 3, 2025
బాహుబలి విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న రిలీజ్ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ కనిపిస్తారు.