
ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత సుపరిచితమైన విమర్శకుల ప్రశంసలు పొందిన పేర్లలో ఒకరిగా కృతిసనన్ ఎదిగింది. అయితే, ఆమె స్టార్‌డమ్‌కు మార్గం ఇంజనీరింగ్ క్లాస్‌రూమ్‌ల నుంచే మొదలైంది.
ఇంజనీరింగ్ టూ సిల్వర్‌స్క్రీన్..
సంప్రదాయ. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కృతి బాలీవుడ్ తో ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా, వినోద ప్రపంచంలోకి పూర్తిగా బయటి వ్యక్తిగా ప్రవేశించింది. ఆమె మొదట్లో మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది, క్రమంగా తన విలక్షణమైన శైలి ఆత్మవిశ్వాసంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2014లో ప్రముఖ నటుడు జాకీ ష్రో కుమారుడు టైగర్ ష్రోతో కలిసి యాక్షన్ రొమాన్స్ చిత్రం హీరోపంతిలో నటించడంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ అరంగేట్రం విజయవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. శరవేగంగా ఆకట్టుకునే అందాల తారగా మారి భారతీయ సినిమాలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించింది. ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన సీత పాత్రలోనూ నటించింది.
2015లో, రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో కృతి బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్ ఫుల్ 4 తదితర చిత్రాల ద్వారా స్థిరమైన విజయాలను దక్కించుకుంటూ వచ్చింది. మిమి (2021)లో పోషించిన సర్రోగేట్ తల్లి పాత్ర ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందించింది. అందంతో పాటు అభినయ ప్రతిభ ఉన్న నటిగా బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
బిజినెస్‌లో బిజీ బిజీగా...
అనంతరం కృతి అభిరుచులు కెమెరాకు మించి విస్తరించాయి. మోడలింగ్ సినిమా సెట్లలో గ్లామర్ సౌందర్య పోషణతో సంవత్సరాల తరబడి పరిచయం ఉండడంతో కృతి సులభంగా స్కిన్ కేర్ స్పేస్ లోకి ప్రవేశించింది. కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో, ఆమె చర్మ సంరక్షణ దినచర్యలు, ఉత్పత్తులను లోతుగా అర్థం చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ అభిరుచి 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫర్ ను ప్రారంభించడానికి దారితీసింది. హైఫన్ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ బ్యూటీ లేబుల్‌లలో ఒకటిగా నిలిచింది, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ చర్మ సంరక్షణ లేబుల్ దాని మొదటి సంవత్సరంలోనే రూ. 100 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని ఆర్జించింది, అత్యంత పోటీతత్వ మార్కెట్‌లో తనను తాను స్థిరపరచుకుంది. కత్రినా కైఫ్ కే బ్యూటీ, మీరా రాజ్‌పుత్ అకైండ్, ఆష్కా గోరాడియా రెనీ కాస్మెటిక్స్ వంటి వాటితో పోటీ పడుతోంది. కృతికి చర్మ సంరక్షణ పట్ల ఉన్న నిజమైన మక్కువ, ఆమె స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించడం ఈ బ్రాండ్ శీఘ్ర విజయానికి మూలస్తంభంగా మారింది.
ఫిట్...హిట్...
స్కిన్ కేర్ ఉత్పత్తుల కంటే ముందే . 2022లో, ఆమె ఫిట్‌నెస్ బ్రాండ్ అయిన ది ట్రైబ్‌ను సహ యజమానురాలిగాస్థాపించింది. దీనికి ఆమె మిమి షూటింగ్ కోసం కృతి తన పాత్రను పండించడం కోసం దాదాపు 15 కిలోగ్రాముల బరువు పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా జిమ్‌లు మూసేయడంతో అదనపు బరువు తగ్గడం ఆమెకు బాగా కష్టమైంది. దాంతో వర్చువల్ సెషల్ ద్వారా నలుగురు వ్యక్తిగత శిక్షకుల మార్గదర్శకత్వంలో తాను ఇంట్లోనే వ్యాయామం చేశానని కృతి వెల్లడించింది. ఈ లోతైన వ్యక్తిగత సవాలుతో కూడిన దశ ఆమెను ఆ శిక్షకులతో కలిసి ది ట్రైబ్ ఏర్పాటుకు ప్రేరేపించింది. అదే సంవత్సరంలో, ఆమె ముంబైలోని ఉన్నత స్థాయి జుహు ప్రాంతంలో తన మొదటి ఫిట్‌నెస్ స్టూడియోను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత, 2024లో, ముంబైలోని మరొక ఉన్నత పరిసర ప్రాంతమైన బాంద్రాలో రెండవ స్టూడియో తెరిచింది.