
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో అలరించిన బ్యూటీ ప్రియాంక జైన్. తన ఆటతీరుతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే అమెరికాలో చిల్ అయిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనుంది. తన ప్రియుడు శివకుమార్ను పెళ్లాడనుంది. ఈ ఏడాది జూన్లో ప్రియుడికి ప్రపోజల్ చేసిన విషయాన్ని పంచుకుంది. ప్రియుడి బర్త్ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.
అయితే త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ఈ జంట శ్రావణ మాస పూజలో పాల్గొన్నారు. వరలక్ష్మీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. కాబోయే భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం పూజలు చేసింది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ పూజల్లో ప్రియాంక జైన్ మదర్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ మరో నెటిజన్ మాత్రం పెళ్లి కాకుండానే ఇలా పూజలు చేయడానికి సిగ్గులేదా? అంటూ పోస్ట్ చేశారు.
