breaking news
	
		
	
  varalaxmi devi
- 
      
                   
                                                     
                   
            కాబోయే భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ వరలక్ష్మీ పూజ.. మీకసలు సిగ్గుందా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో అలరించిన బ్యూటీ ప్రియాంక జైన్. తన ఆటతీరుతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే అమెరికాలో చిల్ అయిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోనుంది. తన ప్రియుడు శివకుమార్‌ను పెళ్లాడనుంది. ఈ ఏడాది జూన్‌లో ప్రియుడికి ప్రపోజల్ చేసిన విషయాన్ని పంచుకుంది. ప్రియుడి బర్త్ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.అయితే త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ఈ జంట శ్రావణ మాస పూజలో పాల్గొన్నారు. వరలక్ష్మీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. కాబోయే భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం పూజలు చేసింది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ పూజల్లో ప్రియాంక జైన్ మదర్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్స్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ మరో నెటిజన్ మాత్రం పెళ్లి కాకుండానే ఇలా పూజలు చేయడానికి సిగ్గులేదా? అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) - 
            
                                     
                                                           
                                   
                వరలక్ష్మీ నమోస్తుతే
 


