రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ మన రాజా సాబ్ టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.
అయితే ఈ టీజర్‌లోని ఓ డైలాగ్‌ను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. ప్రజలకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. అందులో ది రాజాసాబ్ టీజర్‌లోని డైలాగ్‌ను చూపించారు. హలో హలో బండి కొంచెం మెల్లగా.. అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కోసం కల్పించే ప్రయత్నం చేశారు.
అంతేకాకుండా ప్రభాస్ మిర్చి సినిమాలో విజువల్స్‌ను కూడా ట్రాఫిక్ పోలీసులు వినియోగించారు. మిర్చి చిత్రంలో హెల్మెట్ ధరించిన బైక్‌పై వస్తున్న విజువల్స్‌ను ఇందులో చూపించారు. వీటితో పాటు సాహో మూవీలోని కొన్ని సీన్స్‌ను కూడా ఇందులో కలిపేశారు. కనీసం ఇది చూసైనా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా పోలీసులు చేసినా ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
మారుతి రియాక్షన్..
ఈ వీడియో చూసిన ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇది చాలా ఫర్‌ఫెక్ట్.. మా సినిమా డైలాగ్‌ను పాజిటివ్ కోణంలో ఉపయోగించడం సూపర్ అంటూ ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ది రాజా సాబ్ ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
 
Yes sir perfect... thank u for using our footage in positive manner
— Director Maruthi (@DirectorMaruthi) June 17, 2025
#HYDTPweBringAwareness
📢ℋℯ𝓁𝓁ℴ... ℋℯ𝓁𝓁ℴ....!
బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.
🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
