
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామందికి అతడి సినిమాల కంటే రష్మికనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో కలిసి నటించిన వీళ్లు.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో ఈ పుకార్లని బలపరిచేలా విజయ్, రష్మిక వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు రూమర్ బాయ్ ఫ్రెండ్ కోసం రష్మిక మరో క్రేజీ పని చేసింది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ బయటపెట్టారు.
(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)
విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన 'కింగ్డమ్' మూవీ రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాగానే ఫెర్ఫార్మ్ చేస్తోంది. రిలీజ్ రోజే.. 'మనం కొట్టినం' అని సంతోషంగా సినిమా సక్సెస్ గురించి రష్మిక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు సీక్రెట్‌గా హైదరాబాద్‌లోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్లి మరీ ఈ మూవీ చూసొచ్చింది. తాజాగా పలువురు మీడియా వాళ్లతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరగ్గా.. ఇందులో మాట్లాడిన నాగవంశీ ఈ సంగతి చెప్పుకొచ్చారు.
భ్రమరాంబ థియేటర్‌లో రష్మిక.. 'కింగ్డమ్' చూడాలనుకుందని, అయితే ఈమె వెళ్లిన తెలిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్లి సినిమా చూసొచ్చారు అని నాగవంశీ.. అసలు సంగతి చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విజయ్-రష్మిక బాండింగ్ అంటే ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే 'కింగ్డమ్' చిత్రానికి రెండు రోజుల్లో రూ.53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)