
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "కింగ్డమ్" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోంది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ సినిమా బాగుందంటూ వస్తున్న మౌత్ టాక్ తో థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. వీక్ డే అయిన గురువారం థియేటర్స్ లోకి వచ్చిన "కింగ్డమ్" సినిమా మొదటి రోజే 39 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శుక్ర, శనివారాలు కూడా ఈ వసూళ్ల జోరు అలాగే కొనసాగింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ కు రికార్డ్ నెంబర్ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఆమెరికన్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది. కింగ్డమ్ 100 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో ఈజీగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నాదమ్ముల మధ్య అనుబంధం నేపథ్యంగా ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన కింగ్డమ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. విజయ్ దేవరకొండ ఇటీవల మిస్ అయిన సక్సెస్ ను కింగ్డమ్ తిరిగి తీసుకొచ్చింది.