పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా థాంక్యూ డియర్’ ట్రైలర్‌ | Hebah Patel Thank You Dear Movie Trailer Released | Sakshi
Sakshi News home page

పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా హెబ్బా పటేల్‌ ‘థాంక్యూ డియర్’ ట్రైలర్‌

Jul 29 2025 7:30 PM | Updated on Jul 29 2025 8:11 PM

Hebah Patel Thank You Dear Movie Trailer Released

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించిన తాజా చిత్రంథ్యాంక్యూ డియర్‌. తోట శ్రీకాంత్దర్శకత్వం వహించిన చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్ నాగ మహేష్ రవి ప్రకాష్ చత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేయగా చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా నేడు థాంక్యూ డియర్ చిత్ర బృందం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. అయితే అప్పటికే రేఖ నిరోషాతో పెళ్లయిన ధనుష్ రఘుముద్రి హెబ్బా పటేల్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వారి ఇద్దరి మధ్య ధనుష్ ఎలా మేనేజ్ చేశాడు ట్రైలర్లో చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ట్రైలర్ లోని డైలాగులు అటు హాస్యంగా అలాగే ఇటు ట్రెండ్ కు తగ్గట్లు ఉన్నాయి. అదేవిధంగా సినిమాలో ఎన్నో మలుపులతో కూడిన సస్పెన్షన్ ఉన్నట్లు అర్థమవుతుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement