breaking news
Thank You Dear Movie
-
సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అలా భద్రకాళి, కిష్కింధపురి, ఓజీ, మిరాజ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఈ శుక్రవారం (అక్టోబర్ 24) పలు తెలుగు చిత్రాలు సడన్ సర్ప్రైజ్ అన్నట్లు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ ఆ కొత్త మూవీస్ ఏంటి? ఎందులో చూడొచ్చు?కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే జానర్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ చక్రవర్తి'. ఆగస్టు 29న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. అలా వచ్చిన రెండు మూడు రోజులకే బిగ్ స్క్రీన్ పై నుంచి కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకుడు కాగా విజయ్ రామరాజు, షిజా రోజ్ హీరోహీరోయిన్లుగా నటించారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'గ్యాంబ్లర్స్'. ఈ ఏడాది జూన్ తొలివారం థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ పరంగా మరీ తీసికట్టుగా ఉండేసరికి ప్రేక్షకులు దీన్ని తిరస్కరించేశారు. ఆగస్టులో ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండింటిలోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.దివంగత నటుడు శ్రీహరి ఫ్యామిలీ నుంచి ఇదివరకే ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు సినిమాలు చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు శ్రీహరి మేనల్లుడు ధనుష్ కూడా టాలీవుడ్లోకి పరిచయమయ్యాడు. 'థ్యాంక్యూ డియర్' పేరుతో మూవీ తీశాడు. ఆగస్టు 01న ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియనంతలా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకుడు కాగా ధనుష్ సరసన హెబ్బా పటేల్ నటించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా) -
హెబ్బా పటేల్ థాంక్యూ డియర్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.థాంక్యూ డియర్ కథేంటంటే..సత్య(ధనుష్ రఘుముద్రి) సినిమా డైరెక్టర్ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.ఎలా ఉందంటే..ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు ఈ మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్‌గా డైరెక్టర్ తాను అనుకున్న సందేశమిచ్చాడు.ఎవరెలా చేశారంటే..హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్‌లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా థాంక్యూ డియర్’ ట్రైలర్
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ డియర్. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్ నాగ మహేష్ రవి ప్రకాష్ చత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేయగా చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా నేడు థాంక్యూ డియర్ చిత్ర బృందం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. అయితే అప్పటికే రేఖ నిరోషాతో పెళ్లయిన ధనుష్ రఘుముద్రి హెబ్బా పటేల్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వారి ఇద్దరి మధ్య ధనుష్ ఎలా మేనేజ్ చేశాడు ట్రైలర్లో చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ట్రైలర్ లోని డైలాగులు అటు హాస్యంగా అలాగే ఇటు ట్రెండ్ కు తగ్గట్లు ఉన్నాయి. అదేవిధంగా సినిమాలో ఎన్నో మలుపులతో కూడిన సస్పెన్షన్ ఉన్నట్లు అర్థమవుతుంది.


