హెబ్బా పటేల్ థాంక్యూ డియర్‌ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Tollywood Movie Thank You Dear Review In Telugu | Sakshi
Sakshi News home page

Thank U Dear Movie Review In Telugu: థాంక్యూ డియర్‌ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Aug 1 2025 7:44 PM | Updated on Aug 1 2025 8:07 PM

Tollywood Movie Thank You Dear Review In Telugu

ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

థాంక్యూ డియర్ కథేంటంటే..

సత్య(ధనుష్‌ రఘుముద్రి) సినిమా డైరెక్టర్‌ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.

ఎలా ఉందంటే..

ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.

దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్గా డైరెక్టర్తాను అనుకున్న సందేశమిచ్చాడు.

ఎవరెలా చేశారంటే..

హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement