
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కింగ్‌డమ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో అనిరుధ్ రవిచందర్ కింగ్‌డమ్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్లో కచ్చితంగా మైల్ స్టోన్‌గా నిలుస్తుందని అన్నారు. మీరందరూ సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నానని అనిరుధ్ మాట్లాడారు. అదే సమయంలో అక్కడే విజయ్ మదర్ మాధవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి చిత్రం సూపర్ హిట్ కావాలని దేవుడిని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.