ఓటీటీలో 'సిద్ధార్థ్‌ ' సినిమా.. అఫీషియల్‌ ప్రకటన | Siddharth 3BHK Movie OTT Streaming Details Out Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'సిద్ధార్థ్‌ ' సినిమా.. అఫీషియల్‌ ప్రకటన

Jul 29 2025 1:08 PM | Updated on Jul 29 2025 1:36 PM

Siddharth 3BHK Movie OTT Streaming Details Out Now

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జులై 7 విడుదలైంది. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చిన చిత్రం బాక్సాఫీస్వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్అవుతుందని విమర్శలు వచ్చాయి. చిత్రంలో సిద్ధార్థ్‌, శరత్‌కుమార్‌, దేవయాని, మీతా రంగనాథ్‌, చైత్ర, యోగిబాబు తదితరులు‌ నటించారు.

థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్న '3 బీహెచ్‌కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్‌(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్‌, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్లో ఉన్న ప్రేక్షకులకు సినిమా చూసే ఛాన్స్లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమేఅవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్ప్రైమ్లో చిత్రం భారత్లో స్ట్రీమింగ్కానుందని సమాచారం. ఒకవేళ తేదీన రాకుంటే.. ఆగష్టు 8 తప్పకుండా విడుదల కావచ్చని టాక్ఉంది.

నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement