దేవిశ్రీ ప్రసాద్, సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘ఎస్‌ఎస్‌ఆర్ 61’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో సింగీతం క్రియేటివిటీ, ఆయనకి సినిమాలపై ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన ప్రభావాన్ని గుర్తు చేసే క్లిప్స్ ఆకట్టుకున్నాయి.
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీకి క్రియేటివ్ సహకారం అందించిన ఆయన... ఇప్పుడు స్వయంగా ‘ఎస్‌ఎస్‌ఆర్ 61’ కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం మరింత ఎనర్జీని తీసుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాలో ఒక మైలురాయిలా నిలిచేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.


