శ్రీలీలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. బిగ్‌ ప్రాజెక్ట్‌కు ఎంపిక | Sreeleela enters in Dhanush 55th movie | Sakshi
Sakshi News home page

శ్రీలీలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. బిగ్‌ ప్రాజెక్ట్‌కు ఎంపిక

Jan 31 2026 8:21 PM | Updated on Jan 31 2026 8:25 PM

Sreeleela enters in Dhanush 55th movie

నటుడు ధనుష్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కుబేర, ఇడ్లీకడై, హిందీ చిత్రం తేరేఇష్క్‌మే వంటి ప్రాజెక్ట్‌లతో పాన్‌ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా తన 55వ సినిమా వివరాలను ఆయన పంచుకున్నాడు. అమరన్‌ వంటి సంచలన విజయాన్ని సాదించిన చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామితో ధనుష్‌ సినిమా ప్రకటన ఇప్పటికే వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చేసింది. ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఇందులో ధనుష్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్‌ పనిచేస్తున్నారు ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

ఐసరిగణేశ్‌ తమ వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని సమ్మర్‌ ముగింపు సమయంలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. హీరోయిన్‌ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో మెప్పిస్తుంది. ఇప్పటికే  ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ధనుష్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement