ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన మూవీ ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్ దర్శకుడిపై ట్రోల్స్‌కు దిగారు. అయితే, మరోసారి మారుతితో ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ పెట్టనుందని నెట్టింట వైరల్ అయింది. దీంతో ప్రభాస్ టీమ్ స్పందించింది.
రాజాసాబ్ తర్వాత ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి మూవీలతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సినిమాల గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని పేర్కొంది. దీంతో మారుతితో ప్రభాస్ మరోసారి ప్రభాస్ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్ ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని తేలిపోయింది. అయితే, మారుతి దర్శకుడిగా ఒక మిడ్ రేంజ్ హీరోతో హోంబలే ఫిల్మ్స్ ఒక మూవీ తీస్తుందని ప్రచారం జరుగుతుంది.


