
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదానిరి అర్థం మరి సింపుల్గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ అండతో స్టార్‌గా ఎదగడమే. ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంచు మనోజ్ మాట్లాడారు. యూట్యూబ్‌తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్నే అని.. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. దీనికి కౌంటర్గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ)
మంచు మనోజ్ మాట్లాడుతూ..'నేను కూడా నెప్టో కిడ్నే. అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు. బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. నేను కూడా అలానే వచ్చా. నెప్టో కిడ్గా చెబుతున్నా.. ఇక్కడ అలాంటివి పనిచేయవు. ఎవరైనా దేకాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అనేది.. పెద్ద స్టార్ చేశారా? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు.. సినిమా ఎప్పటికీ సినిమానే. మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది.' అని అన్నారు. కాగా.. మాళవికా మనోజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.
🚨#ManchuManoj latest 💥pic.twitter.com/xXf7hb0M9N
— Tollywood Movies ✨ (@TollyMovies4u) July 8, 2025