
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే 30న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల, క్రాంతి కిరణ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ రాజా, రవీంద్ర శరత్, సంపత్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.