ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్ | Bhairavam 2025 Movie Day 1 Box Office Collections Worldwide, Know More Details Inside | Sakshi
Sakshi News home page

Bhairavam Collections: 'భైరవం'.. Day 1 వసూళ్లు ఎంత?

May 31 2025 3:22 PM | Updated on May 31 2025 3:57 PM

Bhairavam Movie Day 1 Collection Worldwide

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'భైరవం'. నిన్న థియేటర్లలోకి వచ్చింది. చాలావరకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ జనాలు మాత్రం కొంతమేర బాగానే థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ చిత్రానికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్?

(ఇదీ చదవండి: రీ రిలీజ్‌లో మహేశ్ 'ఖలేజా' కలెక్షన్స్ రికార్డ్)

ముగ్గురు హీరోలు నటించిన ఈ మినీ మల్టీస్టారర్ మూవీ.. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్. అయినా సరే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు చిన్న చిన్న మార్పులు చేశారు. తొలిరోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.75 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. 'ఖలేజా' రీ రిలీజ్ కావడం ఓ రకంగా దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చేమో. ఎందుకంటే మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రేక్షకులు మహేశ్ మూవీకి ఓటేశారు.

భైరవం చిత్రానికి ఓవర్సీస్‌లోనూ పర్వాలేదనిపించే ప్రారంభం దక్కింది. తొలిరోజు 50 వేల డాలర్లు వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్ కలెక్షన్ పోస్టర్ ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. కథ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఊరు. గజపతి (మనోజ్), వరద (నారా రోహిత్), శీను ఫ్రెండ్స్. అయితే గజపతి కుటుంబం.. ఓ అమ్మవారి ఆలయానికి ట్రస్టీగా ఉంటారు. ఆలయానికి చెందిన వెయ్యి కోట్ల విలువైన భూమిపై ఓ మంత్రి కన్నేస్తాడు. దీని వల్ల ముగ్గురు హీరోల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement