పవర్‌ఫుల్‌ పాత్రలో... | Nidhhi Agerwal birthday celebrates at new film launch | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పాత్రలో...

Aug 18 2026 1:56 AM | Updated on Aug 18 2026 6:22 AM

Nidhhi Agerwal birthday celebrates at new film launch

హీరోయిన్ నిధీ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ మైథాలజీ థ్రిల్లర్‌కి ‘తంత్ర’ మూవీ ఫేమ్‌ శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడు. వరాహ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సునీత్‌ పడోల్కర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పి.అశోక్, పి. రేణుక కెమెరా స్విచ్చాన్   చేయగా, హుర్మత్‌ సర్నా క్లాప్‌ ఇచ్చారు.

సోమవారం (ఆగస్టు 17) నిధి బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘నిధీ అగర్వాల్‌ కోసం ఓ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేశారు శ్రీనివాస్‌. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement