చుట్టమల్లే సాంగ్ వివాదం.. సెలబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్..! | Director Ram Gopal Varma fire On Celebrities tweets on Chuttamalle song | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: చుట్టమల్లే సాంగ్ వివాదం.. సెలబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్..!

Oct 4 2026 11:22 AM | Updated on Oct 4 2026 11:28 AM

Director Ram Gopal Varma fire On Celebrities tweets on Chuttamalle song

దేవర సాంగ్‌ చుట్టమల్లే ఏఐ వీడియోపై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్పందించారు. ఈ వివాదంపై సెలబ్రిటీలు స్పందించడాన్ని ఆయన మండిపడ్డారు. అసభ్యకర లింక్, కంటెంట్ కోట్లాది మంది చూసే సెలబ్రిటీలే మరింత పబ్లిసిటీ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట్లాది మంది దృష్టికి ఆ కంటెంట్‌ను తీసుకెళ్లే బదులు, దానికి బాధ్యులైన నిందితులను గుర్తించి పట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిందని ఆర్జీవీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

ఏఐ వీడియో వివాదంపై సినీ ప్రముఖులు స్పందించడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. బాధితురాలికి, అభ్యంతరకరమైన కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు చేయడం కూడా తప్పేనని ఆర్జీవీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలోని చుట్టమల్లే వీడియో సాంగ్‌ను అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్‌ సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. సాంకేతికతను దుర్వినియోగం చేసేవారిని వదిలిపెట్టనంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement