యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం ‘మత్స్య’. ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ గ్లింప్స్ డిజిటల్ గా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ రాబట్టడం విశేషం. టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను కలిపి ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసిన ‘మత్స్య’ గ్లింప్స్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ సినిమా టీమ్ లో జోష్ నింపుతోంది.


