లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సందర్శనార్థం చెన్నై విరుగంబాక్కంలోని నివాసంలో ఉంచారు.
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సింగీతం శ్రీనివాసరావుకు నివాళులర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని, సినీ రంగంలో ఆయన అందించిన అద్భుతమైన సేవలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.


