విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నాళ్ల నుంచి ప్రేమించిన హీరోయిన్ రష్మికతో కొత్త జీవితం మొదలుపెట్టాడు. అయితే ఈ వివాహ వేడుకలో విజయ్.. మెడలో బంగారు నగలు వేసుకుని రావడం చిత్రంగా అనిపించింది. అయితే ఇదంతా తన ప్లాన్‌లో లేదని బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. మరీ ఇలానా?)
గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్-రష్మిక జంటగా నటించారు. కానీ పెళ్లి తర్వాత 'రణబాలి' కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వచ్చే శుక్రవారం(అక్టోబర్ 16) థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా సుమతో చేసిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాను? ఎలా జరిగింది? అనే విషయాల గురించి చెప్పాడు.
'నేను సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెద్దగా హడావుడి లాంటివి చేయకుండా పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ ఇది తెలిసి మా అమ్మ నన్ను రెండు కొట్టింది. పదిరోజుల పాటు ఇంట్లో ఏడ్చింది. పెద్ద కొడుకువి ఇలా చేస్తే ఎలా అని రచ్చ రచ్చ చేసింది. దీంతో ఇలా కాదు కింగ్‌లా దిగాలని ఒంటిపై బంగారం వేసుకుని పెళ్లి చేసుకున్నాను' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక.. హైదరాబాద్‌లో సెలబ్రిటీల కోసం రిసెప్షన్ పెట్టారు. అలానే విజయ్ దేవరకొండ తన సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేశాడు.
(ఇదీ చదవండి: ముంబైని వదిలేస్తున్న 'ధురంధర్' దర్శకుడు!)


