ముంబైని వదిలేస్తున్న 'ధురంధర్' దర్శకుడు! | Aditya Dhar And Yami Gautam Leave Mumbai And Shift Himachal Pradesh | Sakshi
Sakshi News home page

Aditya Dhar Yami Gautam: 'ధురంధర్' దర్శకుడు-భార్య షాకింగ్ నిర్ణయం!

Oct 4 2026 3:53 PM | Updated on Oct 4 2026 3:55 PM

Aditya Dhar And Yami Gautam Leave Mumbai And Shift Himachal Pradesh

'ధురంధర్' ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు ఎంతలా సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దెబ్బకు దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోయింది. ఇతడు నెక్స్ట్ ఏ హీరోతో ఎలాంటి మూవీ చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఇతడు, తన భార్యతో కలిసి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: సుకుమార్ ఇంటిచుట్టూ మూడేళ్లు తిరిగితే చివరకు: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల)

ఆదిత్య ధర్‌ది న్యూఢిల్లీ కాగా యామీ గౌతమ్‌ది హిమాచల్ ప్రదేశ్. బాలీవుడ్ సినిమాల్లో పనిచేసేందుకు వేర్వేరుగా ముంబై వచ్చారు. అలా కలిసి పనిచేసిన టైంలో వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం. స్నేహం నుంచి మొదలై ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరి వివాహం.. హిమాచల్ ప్రదేశ్‌లోని యామీ ఇంటిలోనే జరిగింది. ఇప్పుడు అక్కడికే పూర్తిగా మకాం మార్చేయాలని ఈ జంట దాదాపుగా ఫిక్స్ అయ్యారట.

వీరిద్దరూ ముంబై కంటే హిమాచల్‌ ప్రదేశ్‌లోని తమ సొంతింటిలోనే ప్రస్తుతం ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. యామీకి హిమాచల్‌ ప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. పెళ్లికి ముందే ఆమె మండిలోని గోహర్‌ ప్రాంతంలో 100 ఏళ్ల నాటి పురాతన ఇంటితో పాటు దాదాపు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. చెక్క, రాళ్లతో నిర్మించిన ఈ ఇంటి చుట్టూ సేంద్రియ పద్ధతిలో సాగుచేసే తోటలు ఉన్నాయి. వీటిలోనే యాపిల్స్, బంగాళా దుంపలు, ప్లమ్స్, అల్లం లాంటి పంటలను పండిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ సినిమా కెరీర్ వల్ల ముంబైలోనే ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆదిత్య-యామీ.. పూర్తిగా సొంతూరికి షిఫ్ట్ అయిపోవాలని ఫిక్స్ అయ్యారనమాట. ఒకవేళ అదే జరిగితే షూటింగ్స్ ఉన్న టైంలోనే ముంబైలో, లేదంటే హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటారేమో!

(ఇదీ చదవండి: వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. మరీ ఇలానా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement