దాదాపు 95 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించిన సంచలనం సృష్టించిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సింగ్ గీతం పేరుతో మూవీని తెరకెక్కించారు. ఇది చూశాక డైరెక్షన్‌కు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మలి వయసులో ఆయన చూపిన దర్శకత్వ బాధ్యతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వయసులోనూ మరో సినిమాల చేయాలనుకున్న ఆయన.. తన కల నేరవేరకుండానే తుదిశ్వాస విడిచారు.
సింగ్ గీతం తర్వాత మరో సినిమాల చేయాలని సింగీతం శ్రీనివాసరావు భావించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తన 62వ చిత్రం టైటిల్ కూడా తనతో చెప్పారని వాట్సాప్ చాట్‌ను షేర్ చేశారు. ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్ అనే టైటిల్‌తో మూవీ తెరకెక్కించనున్నానని చెప్పారని నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయన మరణం వేళ ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. చివరిదశలోనూ ఆయన దర్శకత్వం వహించాలని చూడడం చూస్తుంటే.. సినిమాపై ఆయనకున్న మక్కువ, ఆసక్తి ఏంటో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇక ఇప్పుడు.. సింగీతం 62వ ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్ గానీ, మరెవరైనా గానీ దానిని ముందుకు తీసుకెళ్లి, ఆ సినిమా చేస్తారేమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


