నయనతార గుండు చేయించుకున్నారా?..ఫోటోలు వైరల్‌! | Fact check: Nayanthara Goes Bald At Tirumala, Here Clarity | Sakshi
Sakshi News home page

నయనతార గుండు చేయించుకున్నారా? అసలు నిజం ఇదే!

Aug 18 2026 2:39 PM | Updated on Aug 18 2026 2:51 PM

Fact check: Nayanthara Goes Bald At Tirumala, Here Clarity

ఏఐ  టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమైన ఫొటో.. ఏది మార్ఫింగ్ చేసిన చిత్రం అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తరచూ కనిపిస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార విషయంలోనూ ఇలాంటి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నయనతార గుండు చేయించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో నిజం లేదని తెలుస్తోంది.

నిజానికి నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్‌తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వారికి అభివాదం చేశారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement