మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతానికిపైనే పూర్తయినట్లు రాజమౌళి పేర్కొన్నారు. అయితే ఈ మూవీ జర్నీలో జార్జియాకు చెందిన సినిమాటోగ్రాఫర్– డాక్యుమెంటరీ డైరెక్టర్ గోగితా చిక్వాడ్జే భాగమయ్యారట. ‘వారణాసి’ మేకింగ్ డాక్యుమెంటరీని ఆయన చిత్రీకరిస్తున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్‌ని అక్టోబరుకల్లా పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్‌గా పెట్టుకున్నారట.
అయితే ‘వారణాసి’ ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించే బాధ్యతలను గోగితా చిక్వాడ్జేకు అప్పగించారట రాజమౌళి. ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్స్ నుంచే గోగితా తన పనిని ప్రారంభించార ట. నటీనటుల రిహార్సల్ సీన్స్ , వర్క్ షాప్స్, లొకేషన్స్ , మేకింగ్, సెట్ వర్క్స్... ఇలాంటివన్నీ ఈ డాక్యుమెంటరీలో ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.


