ఓటీటీలో‍కి స్పైడర్‌ మ్యాన్‌ కొత్త మూవీ..! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Spider Man Brand New Day OTT Release Date In Telugu Amazon Prime Video | Sakshi
Sakshi News home page

Spiderman OTT: ఓటీటీలో‍కి స్పైడర్‌ మ్యాన్‌ కొత్త మూవీ..! స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Oct 3 2026 8:30 PM | Updated on Oct 3 2026 8:39 PM

Spider Man Brand New Day OTT Release Date In Telugu Amazon Prime Video

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందులో ‘స్పైడర్‌ మ్యాన్‌’ సినిమాలంటే అభిమానుల్లో ఉండే ఆసక్తి మరింత ఎక్కువ. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్ న్యూ డే’ థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఓటీటీలోకి ఎప్పుడంటే..
‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్ న్యూ డే’ అక్టోబర్‌లోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే తొలుత రెంట్‌, బై ఆప్షన్లతో మాత్రమే సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే సాధారణ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నప్పటికీ సినిమాను చూడాలంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో ఇప్పటికే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం.. భారత్‌లోనూ అక్టోబర్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: జ్యోతిష్కుడు వేణుస్వామి.. సన్నీలియోన్‌తో పోల్చుకుంటూ.. (వీడియో)

కథేంటంటే..
‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ ముగింపులో పీటర్‌ పార్కర్‌ను ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. ‘బ్రాండ్‌ న్యూ డే’ కథ అక్కడి నుంచి నాలుగేళ్ల తర్వాత మొదలవుతుంది. తన స్నేహితుడు నెడ్‌, ప్రేమించిన ఎంజే తనను గుర్తుపట్టకపోవడంతో పీటర్‌ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.
తన బాధను మర్చిపోయేందుకు పూర్తిస్థాయిలో స్పైడర్‌ మ్యాన్‌గా మారి న్యూయార్క్‌ నగరంలో నేరాలను అరికట్టడంపై దృష్టి పెడతాడు. అయితే ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు అతడిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మరోవైపు అతడిలోని సాలీడు డీఎన్‌ఏలో చోటుచేసుకునే మార్పులు సరికొత్త శక్తులకు దారితీస్తాయి. ఆ కొత్త శక్తులు పీటర్‌ జీవితాన్ని ఎలా మార్చాయి? వాటితో అతడు ఏం చేశాడు? అనేదే సినిమా.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement