శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టైటిల్‌ సాంగ్‌ విన్నారా..? | Sree Vishnu Comrade Kalyan Title Song Lyrical Video | Sakshi
Sakshi News home page

Comrade Kalyan Title Song: శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టైటిల్‌ సాంగ్‌ విన్నారా..?

Oct 3 2026 6:48 PM | Updated on Oct 3 2026 6:55 PM

Sree Vishnu Comrade Kalyan Title Song Lyrical Video

  శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కామ్రేడ్‌ కల్యాణ్‌. ఈ సినిమాకు జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.  ఈమూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనుంది.

 ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ అండ్ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పాటలను విడుదల చేశారు. తాజాగా టైటిల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కాగా ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement