పెళ్లి తర్వాత ఫస్ట్‌ టైం.. విజయ్‌లో రష్మిక తెచ్చిన మార్పు ఇదే.. | Vijay Feels Rashmika Has Brought Celebration Into His Life Shares | Sakshi
Sakshi News home page

Rashmika About Vijay: ఇంతకాలం అలా బతికా.. పెళ్లి తర్వాత..: విజయ్‌ దేవరకొండ

Oct 3 2026 9:23 PM | Updated on Oct 3 2026 9:24 PM

Vijay Feels Rashmika Has Brought Celebration Into His Life Shares

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబరు 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, రష్మిక తమ వైవాహిక జీవితం, వ్యక్తిగత ఆలోచనల్లో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: విజయ్‌ను ఇమిటేట్‌ చేసిన రష్మిక.. ఈ క్యూట్‌ వీడియో చూశారా..?

ఆయన దేన్నీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు
పెళ్లి తర్వాత మీ ఇద్దరి కలయికలో వస్తున్న ‘రణబాలి’ మీ జీవితంలో కొత్త అధ్యాయమా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి పదాలను తాను పెద్దగా నమ్మనని చెప్పారు. దీనిపై రష్మిక మాట్లాడుతూ.. విజయ్ ఏ విషయాన్నీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోరని, కానీ తనకు మాత్రం ప్రతి చిన్న సందర్భం కూడా ప్రత్యేకమేనని చెప్పింది.

‘నా దృష్టిలో ప్రతి పుట్టినరోజూ ముఖ్యమే. చిన్న చిన్న క్షణాలను కూడా ఆస్వాదించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఎంత సమయం మిగిలి ఉందో ఎవరికీ తెలియదు. అందుకే పెద్ద వేడుకలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న కేక్ కట్ చేసినా ఆ క్షణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. ఎప్పటికీ మనం ఇలాగే శక్తితో, ఆరోగ్యంతో ఉండలేం. వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ కూడా ఉండకపోవచ్చు. అందుకే అన్నీ ఉన్నప్పుడే జీవితంలో ఆనందకరమైన జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి’అని రష్మిక పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జ్యోతిష్కుడు వేణుస్వామి.. సన్నీలియోన్‌తో పోల్చుకుంటూ.. (వీడియో)

నా జీవితంలోకి సెలబ్రేషన్స్ తీసుకొచ్చింది ఆమే
రష్మిక మాటలకు విజయ్ స్పందిస్తూ.. తన జీవితంలోకి సెలబ్రేషన్స్ తీసుకొచ్చింది రష్మికేనని చెప్పారు. ఇద్దరూ ఒక్కటైన తర్వాత తరచూ హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.‘గతంలో ప్రతి రోజును ఓ పోరాటంలా, యుద్ధంలా చూసేవాడిని. పని, కెరీర్, ఇంకా ఏదో సాధించాలి అనే ఆలోచనలతోనే బతికాను. కానీ కష్టపడి సంపాదించింది జీవితాన్ని ఆస్వాదించడానికే అని ఇప్పుడు అర్థమైంది. సంపాదించిన డబ్బును మన సంతోషం కోసం ఖర్చు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడం ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యత’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

 వాస్తవ సంఘటనల ఆధారంగా..
కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే  డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు.అజయ్‌, అతుల్‌ సంగీతం అందించారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. 
ఇదీ చదవండి: చుట్టమల్లె సాంగ్ వివాదం.. జాన్వీ కపూర్ రియాక్షన్..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement