దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై స్పందించిన జూ. ఎన్‌టీఆర్ | Jr NTR reacts to passing of legendary director Singeetham Srinivasa Rao | Sakshi
Sakshi News home page

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై స్పందించిన జూ. ఎన్‌టీఆర్

Oct 4 2026 12:29 AM | Updated on Oct 4 2026 12:54 AM

Jr NTR reacts to passing of legendary director Singeetham Srinivasa Rao

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) మృతిపై ప్రముఖ నటుడు జూ. ఎన్‌టీఆర్ (Jr NTR) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా (X) వేదికగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
 

సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి వంటి ఎన్నో చిత్రాలను కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు ఆయన. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపున్నాను.. ఓం శాంతి.. అంటూ ఎన్‌టీఆర్ తన ట్వీట్‌ను ముగించారు.

సింగీతం శ్రీనివాసరావు చెన్నైలోని కావేరి హాస్పిటల్లో వయోభారంతో తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 95ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.  ప్రయోగాత్మక చిత్రాలతో దక్షిణ భారత సినిమాను విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement